2 లక్షల 437 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల నమోదు : 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా
- November 13, 2017
కువైట్ : ' రాజుల సొమ్ము రాళ్ళ పాలు ...వాహనదారుల ఉల్లంఘనల జరిమానాలు ట్రాఫిక్ శాఖ పాలుగా మారింది. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు గణాంకాల ప్రకారం అక్టోబరు మాసం చివరి నాటికి పలువురు వాహనదారులు 2.437 మిలియన్ల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘనల్లో ప్రత్యక్ష ఉల్లంఘనలు మరియు ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాల ద్వారా 970,000 కేసులు నమోదు చేయబడినవ వని ఇందులో నేరుగా 1 లక్షా 467 మంది పౌరుల ఉల్లంఘనలు నమోదుచేయబడినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజుకి సుమారు 8,333 ఉల్లంఘనలు జరిగాయి. ఈ కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా విధించారు. చిత్రమేమిటంటే ఈ కాలంలోనే 147 మంది ప్రవాసీయులు లైసెన్సు లేకుండా వివిధ వాహనాల డ్రైవింగ్ చేస్తూ పట్ట్టుబడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







