దుబాయ్‌లో ఎతిహాద్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

- November 14, 2017 , by Maagulf
దుబాయ్‌లో ఎతిహాద్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఎమర్జన్సీ ల్యాండింగ్‌ కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి అబుదాబీకి ఈ విమానం ప్రయాణిస్తోంది. ఎతిహాద్‌ సంస్థకి చెందిన విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు ట్విట్టర్‌లో పోస్టింగ్స్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ రూపంలో దర్శనమిచ్చింది. అయితే ఈ ఎమర్జన్సీ ల్యాండింగ్‌కి గల కారణాలు తెలియరాలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com