పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి శాటిలైట్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకొన్న జెమిని

- November 14, 2017 , by Maagulf
పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి శాటిలైట్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకొన్న జెమిని

అజ్ఞాతవాసి సంచలనాలు మొదలయ్యాయి. 100కోట్ల బిజినెస్ తో ఇండస్ట్రీ జనాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన పి.ఎస్.పి.కె.25 శాటిలైట్ రైట్స్ తో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. ట్రేడ్ మార్కెట్ లో భారీ హైప్స్ పెంచుతోంది పవర్ ఫ్లిక్. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి రిలీజ్ కు ముందే రికార్డుల వేట మొదలుపెట్టాడు. పవన్ 25వ సినిమాగా భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన ఈసినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ జనాల్లో భారీ అంచనాలున్నాయి. త్రివిక్రమ్-పవన్ హ్యాట్రిక్ కాంబోలో వస్తోన్న ఈసినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని, వసూళ్ల వేటలో పంజా విసురుతుందని మెగాకాంపౌండ్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతోంది.
ఆడియన్స్, ఇండస్ట్రీలో బజ్ ఎక్కువగా ఉండడంతో బయ్యర్లు కూడా ఈసినిమాపై హెప్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈసినిమా ధియేట్రికల్ రైట్స్ తోనే 100కోట్లకు పైగా బిజినెస్ చేసింది. షూటింగ్ కంప్లీట్ కాకముందే టేబుల్ ప్రాఫిట్ లోకి వెళ్లిపోయింది అజ్ఞాతవాసి. దీంతో సినిమా డామ్ షూర్ గా హిట్ అవుతుందనే టాక్ ఎక్కువవుతోంది. ఈ బజ్ తోనే సినిమా శాటిలైట్ రైట్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అజ్ఞాతవాసి శాటిలైట్ రైట్స్ ను 19కోట్ల50లక్షలకు తీసుకుందట జెమిని టివి. బాహుబలి తర్వాత శాటిలైట్ రైట్స్ లో ఇదే హయ్యెస్ట్ ఫిగర్ అంటున్నాయి మార్కెట్ వర్గాలు. సో అజ్ఞాతవాసి సింగిల్ సాంగ్ లాంచ్ తోనే ఓ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. పవన్, కీర్తి సురేశ్, అనూ ఎమ్మాన్యుయేల్, లీడ్ రోల్స్ లో వస్తోన్న ఈసినిమా జనవరి10న సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com