"ఉందా లేదా..?" మూవీ ట్రైలర్ లాంచ్
- November 14, 2017
రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్
చిత్రం‘ఉందా..లేదా?’. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్దంగా ఉన్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ హైద్రాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది..ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ప్రముఖ నిర్మాత మాల్కాపురం శివకుమార్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా...
ముఖ్య అతిథి నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ ..వినూత్నమైన కథ,కథనంతో ఉందా లేదా చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతుంది.దర్శకుడు అమనిగంటి శివప్రసాద్ ,
నిర్మాత కమల్ గారు చిత్రాన్ని మంచి క్వాలిటితో తెరకెక్కించారు..హీరోహీరోయిన్లు ,దర్శకనిర్మాతలు కొత్తవాళ్లైనా మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు
వస్తోంది..ఈ చిత్రం నటీనటులకు ,సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని ,చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు..
దర్శకుడు అమనిగంటి వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ...ఉందా లేదా చిత్రం ఆవుట్ పుట్ చూసాక తనలో కాన్పెడెంట్ పెరిగిందన్నారు.ఈచిత్రం అందరికి నచ్చుతుందని
అన్నారు..ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు జీవాగారు , రామ్ జగన్ గారు ,ఝూన్సీగారు ,సాంకేతిక నిపుణులు చాలా సపోర్ట్ చేశారని అన్నారు..నిర్మాత కమల్ గారు
ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈచిత్రాన్ని నిర్మించారని అన్నారు..ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సాహించిన కమల్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు....
నిర్మాత అయితం ఎస్.కమల్ మాట్లాడుతూ... సినిమా ముహుర్తపు షాట్ నుంచి గుమ్మడికాయ కొట్టేంతవరకు అందరు ప్రశ్నిస్తున్నారు..మీరు కొత్తవాళ్లు కదా అని..ఔను
నిజమే మీము కొత్తవాళ్లం..ఇప్పటికి వరకు రాని కొత్త కథతో వచ్చామని చెప్పడంలో సంతోషంగా ఉన్నాని అన్నారు.దర్శకుడు అమనిగంటి శివప్రసాద్ ఎదైతే చెప్పాడో ..అదే
స్ర్కీన్ పై చూపించాడని అన్నారు.సినిమాకు సహకరించిన టెక్నిషియన్స్ కు మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు .ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన
శివకుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు..
నటుడు జీవా .. దర్శకుడు శివప్రసాద్ సౌండ్ పోల్యూషన్ వల్ల ప్రజలకు జరిగే అనార్దాలు ఎదురైయ్యే సమస్యలు ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించబోతున్నారు.. ఈ
సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుంది..ఈ సినిమా దర్శకనిర్మాతలకు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు..
రామ్ జగన్ ...ఈ రోజుల్లో సినిమాలకు ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు..అటువంటి ఇబ్బందులకు అదగమించి ఉందా లేదా చిత్రాన్ని పూర్తి చేయడంతో సగం
సక్సెస్ అయ్యామని చెప్పారు..ఈ సినిమాకు మీడియా సహాకారం కావాలని కోరారు..
హీరోయిన్ అంకిత మాట్లాడుతూ ...బెంగుళూరు పుట్టి ..హైద్రాబాద్ లో పెరిగాను..ఉందా లేదా చిత్రం తో వెండితెరకు పరిచమయ్యాను..ఈ చిత్రం ద్వారా మంచి బ్రేక్
వస్తోందనే నమ్మకం ఏర్పడిందన్నారు..ఈ చిత్రం లో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు..
నటీనటులు :రామకృష్ణ ,అంకిత ,కుమార్ సాయి,జీవా, రామ్‌జగన్ ,ఝూన్సీ,ప్రభావతి , బ్యానర్ : జయకమల్ ఆర్ట్స్ , ఎడిటర్ :మణికాంత్ తెల్లగూటి కొరియోగ్రఫీ: నందు
జెన్నా, పాటలు :నాగరాజు కువ్వారపు ,శేషు మోహన్ ,సింగర్స్ :సింహ ,హేమచంద్ర ,స్వీకర్ అగస్సీ , మ్యూజిక్ : శ్రీమురళీ కార్తికేయ సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె బంగారి
సహానిర్మాతలు : అల్లం సుబ్రమణ్యం ,అల్లం నాగిశెట్టి , నిర్మాత : అయితం ఎస్ కమల్ దర్శకత్వం : అమనిగంటి వెంకట శివప్రసాద్
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష