సర్దుకుపోతున్న అడ్డాల
- November 14, 2017
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరుంది. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో తన పంథా నిరూపించుకొన్నాడాయన. ముకుంద ఓకే అనిపించింది. బ్రహ్మోత్సవం మాత్రం డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. ఆ సినిమా శ్రీకాంత్ కెరీర్‌పై దారుణమైన ప్రభావాన్ని చూపించింది. అంతకు ముందు అడ్వాన్సులు ఇచ్చినవాళ్లంతా సైడైపోయారు. శ్రీకాంత్ చేతిలో సినిమాలేం లేవిప్పుడు.
ఇలాంటి దశలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ సినిమా ఆఫర్ ఇచ్చారని టాక్. ఇటీవల అరవింద్ కి ఓ కథ వినిపించాడట అడ్డాలా. దీనికి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ కొత్తగా .. కథనం ఆసక్తికరంగా ఉండటం వల్లనే అల్లు అరవింద్ ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమా నూతన నటీనటులతో తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి .. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు టాక్. ఐతే మహేష్ బాబు వెంకటేష్ లాంటి సీనియర్స్ ను హ్యాండిల్ చేసిన అడ్డాల ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళతో సర్దుకుపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష