మాల్యా కోసం ఆర్థర్ రోడ్‌లో జైలు సిద్దం!

- November 14, 2017 , by Maagulf
మాల్యా కోసం ఆర్థర్ రోడ్‌లో జైలు సిద్దం!

ఢిల్లీ: దేశంలోని వివిధ బ్యాంకులలో వేల కోట్లు రుణాలు తీసుకొని ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్న రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్‌లోని జైలు సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. సరైన సదుపాయాలుగల జైలు లేదని విజయ్ మాల్యా సాకులు చెప్తుండటంతో భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి ఈ స్పష్టతనిచ్చింది. తనను భారతదేశానికి అప్పగించడంలో మరింత ఆలస్యమయ్యేలా చేయడానికి మాల్యా ఈ విధమైన పన్నాగాలు పన్నుతున్నారు. భారతదేశంలోని జైళ్ళలో తన జీవితానికి, ప్రాణాలకు రక్షణ ఉండదని మాల్యా ఆరోపిస్తున్నారు. ఈ నెల 20న బ్రిటన్ కోర్టు ఈ కేసులో విచారణ జరుపుతుంది. భారతదేశంలోని జైలు వివరాలను తెలియజేయడానికి ఆర్థర్ రోడ్ జైలు అధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు బ్రిటన్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మాల్యా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా కట్టుదిట్టమైన వాదనలను వినిపించబోతున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com