యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న సినిమా

- November 15, 2017 , by Maagulf
యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న సినిమా

గడసరి అత్త సొగసరి కోడలు అంటూ బుల్లి తెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, మేల్ యాంకర్లు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయగలరని నిరూపించాడు ప్రదీప్. ఆ ప్రోగ్రామ్‌తోనే ప్రదీప్‌కి గుర్తింపుతో పాటు, బోలెడంత మంది అభిమానుల్ని కూడా తెచ్చిపెట్టింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత బిజీ అయిపోయాడు. ఓ పక్క యాంకరింగ్, లైవ్ షోలు, అడపా దడపా సినిమాల్లో వచ్చే పాత్రలతో ప్రదీప్ షెడ్యూల్ బిజీ. అయితే ఈ సారి ఫుల్ లెంగ్త్ హీరోగా తెరపై సందడి చేయనున్నాడు. అజయ్ సాయి మణికందన్ దర్శకత్వంలో ప్రదీప్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్లనుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com