దుబాయ్ నగరంలో యువతి స్నానం చేస్తుండగా చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిన యువకుడు
- November 15, 2017
భారత్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నగరంలో నీచమైన పనికి పాల్పడ్డాడు. తనతోపాటు అదే కంపెనీలో పని చేస్తున్న మహిళను మొబైల్ ఫోన్ లో నగ్నంగా చిత్రీకరించాడు.
ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ యువతి(28) రాత్రి సమయంలో కంపెనీలోని బాత్‌రూంకు వెళ్లడాన్ని గమనించిన ఈ యువకుడు పక్కనే ఉన్న మరో రూం నుంచి యువతిని తొంగిచూశాడు.
ఆమె నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో మహిళను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. బాత్‌రూంలోని అద్దంపై సెల్‌ఫోన్ ప్రతిబింబం మెరవడంతో ఆ యువతి అప్రమత్తమై వెనుదిరిగి చూసి షాక్ కు లోనైంది.
ఆపైన ఆ యువకుడిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తూ, దుర్భాషలాడింది. ఏడ్చుకుంటూ ఆ విషయాన్ని తోటి సిబ్బందికి కూడా తెలిపింది. దీంతో కంపెనీ అధికారులు వెంటనే అందరి వద్ద సెల్‌ఫోన్ల తీసుకుని వాటిలోని వీడియోలను డిలీట్ చేశారు.
అనంతరం బాధిత యువతి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఆ యువకుడు తనకు సంబంధించి ఇలాంటి వీడియోలు ఏమైనా చిత్రీకరించాడేమోననే అనుమానాన్ని బాధితురాలు వ్యక్తం చేసింది.
ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని అల్ రఫా పోలీసులు తెలిపారు. నిందితుడు క్లర్క్‌గా పనిచేస్తున్నాడని సమాచారం.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







