బాలయ్య నటిస్తున్న 'జై సింహా' ఆడియో తేది ఖరారు
- November 15, 2017
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తండ్రిక తగ్గ తనయుడు అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకు వంద చిత్రాల్లో నటించిన బాలకృష్ణ ఆ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్' చిత్రంతో 101 వ చిత్రాన్ని కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వం 'జై సింహ' చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ఆ మద్య రిలీజ్ అయ్యింది. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం బాలకృష్ణ వరుసగా మూడు చిత్రాల్లో నటించగా ఇప్పటికే 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్ ' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే బాలయ్య యంగ్ హీరోలతో పోటీ పడుతూ..నటన, డ్యాన్స్, ఫైట్స్ లో ఇరగదీస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే సినిమాల్లో నటిస్తున్నారు.
'జై సింహ' సినిమాకి సంబంధించిన విశాఖపట్నం షెడ్యూల్ ముగిసింది.ఆడియో విడుదల తేదీగా డిసెంబర్ 23ను నిర్ణయించారు. పలువురు సినీ ప్రముఖులు .. అభిమానుల సమక్షంలో ఈ వేడుకను విజయవాడలో జరపనున్నారు.
చిరంతన్ భట్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ కాబోతుందట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కావడం .. బాలకృష్ణతో ముగ్గురు కథానాయికలు జోడీ కట్టడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష