దుబాయ్ లో 70 శాతం డిస్కౌంట్ తో షాపింగ్ మేళా

- November 15, 2017 , by Maagulf
దుబాయ్ లో 70 శాతం డిస్కౌంట్ తో షాపింగ్ మేళా

దుబాయ్: ' భలే మంచి చౌక బేరం...ఆలసించిన ఆశాభంగం ' అంటూ తక్కువ ధరలతో, భారీ ఆఫర్లతో, డిస్కౌంట్ల మేళా.. దుబాయి ప్రజలకు  మరోసారి అవకాశమొచ్చింది ఏ నెల నవంబర్ 23 నుంచి నవంబర్ 25 వరకు.. మొత్తం మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ‘దుబాయి ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్’ ప్రకటించింది. ఈ సంవత్సరం డిసెంబర్ 26 వ తేదీ నుంచి డిస్కౌంట్ ఫెస్టివల్ ఉన్నా.. కస్టమర్లకు డబుల్ ధమాకాను అందించేందుకు ఒక నెల ముందుగానే ఈ డిస్కౌంట్ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1200 దుకాణాలు, 300 బ్రాండ్ల వస్తువులపై 30 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయన్నారు. దుస్తులు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటి వాటిపై కూడా ఈ రాయితీలు ఉండనున్నాయి.దుబాయి ప్రజలు ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com