ఇక నుంచైనా తనను తన్నకుండా ఉండాలని షార్జాలో కోర్టుని కోరిన ఓ భార్య

- November 15, 2017 , by Maagulf
ఇక నుంచైనా తనను తన్నకుండా ఉండాలని షార్జాలో కోర్టుని  కోరిన  ఓ భార్య

 షార్జా: జాలి పడటంలో.. జన్మని ఇచ్చిన అమ్మని తలపింపచేసింది ఆ మహాతల్లి ..మూర్కుడు కోపిష్టివాడైనా భర్త నిత్యం పెడుతున్న శారీరక హింసపై విసుగు చెందిన కేసు పెట్టిన జి.సి.సి.దేశాలకు చెందిన ఓ గృహిణి తీరా నిందితుడికి శిక్ష ఖరాయిరయ్యేసరికి ఆ వ్యక్తిపై జాలిపడింది. కేసు ఉపసంహరించుకోవాలంటే తన భర్త హింసాత్మక ప్రవర్తన మార్చుకోవాలని షార్జా క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూషన్ కోరింది. భర్త తనపట్ల చేస్తున్న ఆగడాల పట్ల విసుగు చెందిన ఆమె కేసు పెట్టింది.కోర్టు నిందితుడికి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అలాగే 6,000 ధిర్హాంలను జరిమానా విధించింది. భర్త అరెస్టు అయిన తర్వాత నిందితుడు కోర్టుకు ప్రస్తావించబడ్డాడు. అయితే  ఆ మహిళ తన భర్తపై దావాను తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరుకుంది, ఎందుకంటే, ఎంతైనా " ఆ వ్యక్తి  తన పిల్లలకు  తండ్రి" అని కోర్టుకి విన్నవించింది. నాలుగు నెలల నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న తన భర్త విడుదల చేయాలని కోర్టుని అభ్యర్ధించింది. అయితే  తన నేరాన్ని పునరావృతం చేయకుండా, కట్టుకొన్న భార్యను గౌరవించాలని ఆ మేరకు వ్రాతపూర్వక బాధ్యత వహించాలని ఆమె కోరింది. తన భర్త తనను తీవ్రంగా తన్నడంతో ఆమె గాయపడింది. ఆసుపత్రిలో ఆమె గాయాలకు చికిత్స చేయించుకొంది. ఆ మహిళ తన భర్త చిన్న విషయాలపై చికాకు పడతానని దారుణంగా కొడతాడని ఆమె  చెప్పారు. కోర్టు ఈ కేసుని వాయిదా వేసింది. డిసెంబరులో ఈ కేసుకి సంబంధించి  తీర్పు వెలువరించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com