దుబాయ్ లో 70 శాతం డిస్కౌంట్ తో షాపింగ్ మేళా
- November 15, 2017
దుబాయ్: ' భలే మంచి చౌక బేరం...ఆలసించిన ఆశాభంగం ' అంటూ తక్కువ ధరలతో, భారీ ఆఫర్లతో, డిస్కౌంట్ల మేళా.. దుబాయి ప్రజలకు మరోసారి అవకాశమొచ్చింది ఏ నెల నవంబర్ 23 నుంచి నవంబర్ 25 వరకు.. మొత్తం మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ‘దుబాయి ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్’ ప్రకటించింది. ఈ సంవత్సరం డిసెంబర్ 26 వ తేదీ నుంచి డిస్కౌంట్ ఫెస్టివల్ ఉన్నా.. కస్టమర్లకు డబుల్ ధమాకాను అందించేందుకు ఒక నెల ముందుగానే ఈ డిస్కౌంట్ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1200 దుకాణాలు, 300 బ్రాండ్ల వస్తువులపై 30 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయన్నారు. దుస్తులు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటి వాటిపై కూడా ఈ రాయితీలు ఉండనున్నాయి.దుబాయి ప్రజలు ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







