వలసదారులకి స్వర్గధామం మనామా
- November 15, 2017
మనామా: ఇంటర్ నేషన్స్ ఎక్స్‌పాట్ సిటీ ర్యాంకింగ్స్‌లో మనామా అందరి దృష్టినీ ఆకర్షించింది. వలసదారుల ఫేవరెట్ నగరంగా మనామా ఎంపికయ్యింది. ఫ్రాంక్‌ఫర్ట్, ఆమ్‌స్టర్‌డామ్, కౌలాలంపూర్, జోహెన్నెస్ బర్గ్ వంటి 51 అంతర్జాతీయ నగరాల్ని తలదన్ని మనామా వలసదారుల మనసుల్ని గెలుచుకుంది. ప్యారిస్ 49వ ర్యాంక్‌ని సంపాదించుకుంది. ఇంకో వైపున బహ్రెయిన్‌కి టాప్ ట్వంటీలో చోటు దక్కించుకుంది. 19వ స్థానం దక్కింది బహ్రెయిన్‌కి. స్థానిక భాషతో సంబంధం లేకుండా మనామాలో జీవించవచ్చునని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. వలసదారులకు ఫ్రెండ్లీయెస్ట్ సిటీ మనామా అని చాలామంది పేర్కొన్నారు. 40 దేశాలకు చెందిన 7,985 మంది వలసదారులతో ఈ సర్వే నిర్వహించారు. అర్బన్ లైఫ్‌కి సంబంధించి 25 విభాగాల్లో ప్రశ్నల్ని వలసదారుల ముందుంచారు నిర్వామకులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







