అత్యాచారం: వ్యక్తికి జైలు
- November 15, 2017
దుబాయ్: దుబాయ్ సెంటర్ రెస్ట్‌రమ్‌లో ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డ నేరానికిగాను ఓ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు. బాధితురాల్ని 26 ఏళ్ళ నేపాలీగా గుర్తించారు. మద్యం మత్తులో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2016 జులై 10న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన జరిగిన రోజే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. షాపింగ్ సెంటర్‌లోని రెస్ట్ రూమ్‌లో తాను ఉండగా, అద్దంలో నిందితుడ్ని తాను గుర్తించాననీ, అతన్ని ప్రశ్నించేలోపే, అతను తనపై దాడి చేశాడని బాధితురాలు వివరించింది. బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినా, నిందితుడి పశుబలం ముందు నిలవలేకపోయింది. అనంతరం ఆమెపై అఘాయిత్యం చేశాడు నిందితుడు. ఈ కేసులో తనకు పడ్డ శిక్షపై అప్పీల్ చేసుకోవడానికి నిందితుడికి 30 రోజులపాటు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







