సౌదీ రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి
- November 15, 2017
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువ ఇంజినీర్.. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సరుబుజ్జలి మండలం ఇసుకలపాలేనికి చెందిన శ్రీనివాసరావ్.. సౌదీలోని అల్ జిహా కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ జెడ్డాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు దుర్మరణం చెందాడు. శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియా పంపించేందుకు అల్ జిహా సంస్థ సహకారం అందిస్తున్నప్పటికీ.. స్థానిక చట్టాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని శ్రీనివాసరావు మిత్రులు చెబుతున్నారు. ప్రభుత్వం, నేతలు స్పందించి శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







