డిసెంబర్‌ 7 : హజ్‌యాత్ర దరఖాస్తుకు చివరి తేదీ

- November 15, 2017 , by Maagulf
డిసెంబర్‌ 7 : హజ్‌యాత్ర దరఖాస్తుకు చివరి తేదీ

హైదరాబాద్/నాంపల్లి: హజ్‌ యాత్ర కోసం ఈ నెల 15నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. యాత్రికులు దరఖాస్తు ఫారాలను ఆన్‌లైన్‌లో హజ్‌కమిటీ.జీవోవీ.ఇన్‌ (hajco-m-m-ittee.-go-v.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హజ్‌ యాత్రికుల కోసం బడ్జెట్‌లో రూ.3కోట్ల నిధులు కేటాయించినట్లు డెప్యూటీ సీఎం మహ మూద్‌అలీ పేర్కొన్నారు. నాంపల్లి హజ్‌ హౌస్‌లో బుధవారం హజ్‌ దరఖాస్తుల పంపిణీని ఆయన ప్రారంభించారు. యాత్రికులకు ఈ నెల 15నుంచి డిసెంబర్‌ 7వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి జనవరి మొదటి వారంలో లాటరీ ద్వారా యాత్రికుల వివరాలు వెల్లడించనున్నట్లు హజ్‌ కమిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com