అదిరిపోతున్న'హలో' వినూత్న పోస్టర్స్
- November 15, 2017
అఖిల్ అక్కినేని ప్రస్తుతం 'హలో' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మనం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వం చేస్తున్నాడు. అఖిల్ సరసన కళ్యాణి హీరోయిన్గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకి అక్కినేని ఫామిలీకి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెల్స్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.
పోస్టర్ అదిరింది...
అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పోస్టర్ లో నవంబర్ 16న టీజర్, డిసెంబర్ 22న సినిమా అని వుంది. ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా హలో సినిమా పోస్టర్ విడుదల కాగానే పలువురు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు పొందింది. ఈ లుక్ చూసిన విలక్షణ దర్శకుడు తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో స్పందించాడు.
వర్మ పొగడ్తలు..
తనకు ఎవరన్నా నచ్చకపోతే ఆ సినిమా గురించి చాలా బ్యాడ్ గా పోస్ట్స్ చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. అలానే తనకి ఎవరన్నా నచ్చితే మాత్రం ఆ సినిమాను..ఆ సినిమాలో ఆర్టిస్ట్స్ లను తెగ పొగడ్తలతో ముంచెత్తుతాడు. తన ట్వీట్స్ ద్వారా. అదేవిధంగా పోస్టర్ లో అఖిల్ లుక్ పై కూడా ఇలా పోస్ట్ చేసాడు..'పోస్టర్ ఆధ్బుతంగా.. మతిపోగొట్టేలా ఉంది. ఈ సినిమా అఖిల్ జీవితంలో నిజమైన తొలి చిత్రం కాబోతుంది' అని పేర్కొంటూ 'హలో' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ జత చేశాడు వర్మ. అయితే ఆయన చేసిన ఈ పోస్ట్ పై విపరీతంగా కామెంట్స్ వచ్చి పడుతుండటం విశేషం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







