ఇవాంకా ట్వీట్.. స్పందించిన మోడీ

- November 15, 2017 , by Maagulf
ఇవాంకా ట్వీట్.. స్పందించిన మోడీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ తన భారత పర్యటనపై ఆత్రుతగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్‌లో జరిగే జీఈఎస్(గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సదస్సు)లో ఇవాంకా పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ఈ విషయమై ఇవాంకా ట్రంప్ తాజాగా ఒక ట్వీట్ కూడా చేశారు. 'ప్రధాని మోడీతో కలిసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్యవేత్తలను కలుసుకునేందుకు వెళుతున్నాను. ఈ పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది..' అని ఇవాంకా ట్విట్టర్‌లో మెసేజ్‌ పెట్టారు.
దీనికి మన ప్రధాని మోడీ రీట్వీట్ చేస్తూ.. ఇవాంకాకు స్వాగతం పలికారు. 'మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుంది. భారత్‌లోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం..' అని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com