'నేనే మైఖేల్' పాటలు విడుదల
- November 15, 2017
కలసాధన కృష్ణ దర్శకత్వంలో.. కలసాధన ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం నేనె మైఖేల్. ఈ సినిమాకు బిహారి బ్రదర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. చిన్నప్పటినుండి డాన్స్ నే ప్రాణంగా భావించే ఓ కుర్రవాడు ఎలా మైఖేల్ జాక్సన్ గా మారాడు అనేదే కథాంశం. దర్శకుడు కృష్ణ 550 మంది పిల్లలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తే వారు గొప్ప కళాకారులుగా తయారవుతారనే కాన్సెప్ట్ తో రూపొందించారు. ఈ చిత్రంలోని పాటలు మంగళవారం హైద్రాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పాటల సీడీ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎం ఎల్సీ రాంచందర్ రావ్, సాయి వెంకట్, అడబాల సురేష్ కుమార్, దర్శకుడు ప్రేమ్ రాజ్, రవి కిరణ్, డీసీపీ సుందర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







