'నంది' ఎవరికీ నచ్చట్లేదేంది..!
- November 16, 2017
'అవార్డు' ప్రతిభకు ప్రోత్సాహాన్ని ప్రయోగాలకు ఉత్సాహాన్ని ఇస్తుంది... నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. ఇప్పడు ప్రకటించిన ఈ అవార్డులు వివాదాస్పదంగా మారాయి. ఈ అవార్డుల పట్ల తెలుగు ఇండస్ట్రీ సంతృప్తికరంగా లేదు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో సీనియర్లు ఉన్నా మంచి సినిమాలకు తగినంత గుర్తింపుని, ప్రాధాన్యతను ఇవ్వట్లేదని ఇప్పటికే చారిత్రక ప్రాధాన్యత కలిగిన చిత్రం రుద్రమదేవిని అందించిన గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో మరో నటుడు కూడా చేరిపోయారు. హాస్యనటుడు పృథ్వీ నటించిన 'లౌక్యం' సినిమాలో తను పండించిన హాస్యానికి గానూ అవార్డు వస్తుందని ఊహించాడట. కానీ అతడి ఆశలు అడియాశలయ్యాయి. అవార్డు కమిటీ వాళ్లు ఆ హాస్యనటుడ్ని ఏడిపించారు. అవార్డు లేదు పొమ్మన్నారు. ఇక నిరసన ప్రకటించే వారి లిస్ట్‌లో మెగా ఫ్యామిలీ కూడా ఉంది. మెగా క్యాంపు ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అయినా బన్నీ వాసు తన ఫేస్బుక్లో నంది అవార్డ్స్ పట్ల పలు కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్‌కి అభిమానుల నుంచి మద్దతు కూడా లభిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష