కెనడా పేరుతో యువతులకు టోకరా

- November 16, 2017 , by Maagulf
కెనడా పేరుతో యువతులకు టోకరా

హైదరాబాద్: కెనడా పంపిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసిన ఓ యువతి మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. నగరంలోని నేరేడ్‌మెట్ పోలీస్టేషన్ పరిధిలోగల రాంనగర్ లో నివాసముంటున్న హేమలత అనే యువతి దాదాపు 150 మంది తమిళనాడుకి చెందిన యువతుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. కెనడా దేశానికి పంపిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసింది. అయితే... ఎంతకూ తమను కెనడా పంపించకపోవడంతో అనుమానం వచ్చిన యువతునలు బుధవారం రాంనగర్ వచ్చారు.

తాము మోసానికి గురయ్యామన్న విషయాన్ని గుర్తించిన వారు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బుధవారం నుంచి పోలీస్‌స్టేషన్ పక్కన ఉండే ఓ పార్కులో ఉంటూ వారు ఇబ్బందుల పడుతున్నారు. కాగా తాము కట్టిన డబ్బులు మాకు ఇప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com