ఫ్రైడే కల్చరల్ షో: హరితేజ ఎట్రాక్షన్
- November 16, 2017
మనామా: ఇండియన్ తెలుగు కమ్యూనిటీ, మెగా ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తోంది. తుబ్లిలోని ఆసియన్ స్కూల్ ఆడిటోరియంలో శుక్రవారం మెగా ఈవెంట్ జరగబోతోంది. సయ్యాట పేరుతో జరగనున్న ఈ కల్చరల్ షోని తెలుగు కళా సమితి (టికెఎస్) - బ్రహెయిన్ నిర్వహిస్తోంది. ఔట్ ఆఫ్ ది బాక్స్ సహకారం అందిస్తోంది. 3000 మందికి పైగా ఈ ఈవెంట్‌కి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నటులు, సింగర్స్, కమెడియన్స్ సహా తెలుగు సినీ, టీవీ ఇండస్ట్రీస్‌కి చెందిన ప్రముఖులు హాజరయి, లైవ్‌గా పెర్ఫామెన్స్లు ఇవ్వనున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ వన్ కంటెస్టెంట్, అలాగే పలు సినిమాల్లో నటించిన హరితేజ, సురేష్ వర్మతో కలిసి పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఢీ ఫేం శాంతి తివారీ గ్రూప్, గెటప్ శ్రీను - రామ్ ప్రసాద్ స్కిట్స్ ఇంకా చాలా ఆకర్షణలు ఈ ఈవెంట్లో కనిపిస్తాయని గౌరవ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఫండ్స్ సేకరించి, నీడీ వర్కర్స్‌కి అందివ్వడం, ఛారిటీ కార్యక్రమాల కోసం వినియోగిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







