ఎమర్జన్సీ ల్యాండింగ్ - అయినా దక్కని ప్రాణం
- November 16, 2017
సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, యూఏఈ క్యాపిటల్ అబుదాబీలో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న మొహమ్మద్ సలీమ్ అనే 35 ఏళ్ళ వ్యక్తికి గుండెపోటు రావడంతో, ఎమర్జన్సీ ల్యాండింగ్ అనంతరం అతన్ని ముఫ్రాక్ హాస్పిటల్‌కి తరలించారు. ఎమర్జన్సీ మెడికల్ కేర్ అందించినా, వైద్యులు అతని ప్రాణాన్ని కాపాడలేకపోయారు. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ఇండియాలోని కాలికట్ విమానాశ్రయానికి వెళ్ళవలసి ఉంది ఎమర్జన్సీ ల్యాండింగ్ అయిన విమానం. విమానం గాల్లో ఉండగానే ప్రయాణీకుడి పరిస్థితి విషమంగా మారిందనీ, దుబాయ్ తరలించాలనుకున్నా, పరిస్థితి ఇంకా క్షీణించడంతో అబుదాబీలో విమానాన్ని ల్యాండింగ్ చేసి, ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి తచేసిన తర్వాత మృతుడి బంధువులకు మృతదేహాన్ని అందజేస్తామని డ్యూటీ ఆఫీసర్ శ్రీశాంత్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష