నవంబర్‌ 17న అల్‌ మక్తా బ్రిడ్జి పాక్షికంగా మూసివేత

- November 16, 2017 , by Maagulf
నవంబర్‌ 17న అల్‌ మక్తా బ్రిడ్జి పాక్షికంగా మూసివేత

అబుదాబీలోని అల్‌ మక్తా బ్రిడ్జిని నవంబర్‌ 17న పాక్షికంగా మూసివేయనున్నారు. జనరల్‌ మెయిన్‌టెయినెన్స్‌ వర్‌కలో భాగంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ మునిసిపాలిటీ వెల్లడించింది. సోషల్‌ మీడియా ద్వారా మూసివేత సమాచారాన్ని అందించినట్లు అధికారులు చెప్పారు. అల్‌ మక్తా బ్రిడ్జిపై రెండు ఫాస్ట్‌ లేన్స్‌ని మూసివేస్తారు. రాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com