స్కూల్ లో దారుణం - సంపులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి
- November 16, 2017
హైదరాబాద్: మల్కాజిగిరిలోని బచ్పన్ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం బాలల దినోత్సవం రోజున రెండున్నరేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు, విద్యాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. అదే రోజు విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపారు. ఈ విచారణలో యాజమాన్యానిదే తప్పు అని తేలింది. దీంతో విద్యాశాఖ అధికారులు గురువారం నాడు స్థానిక విద్యాశాఖ అధికారులకు పాఠశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో దానిని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ప్రిన్సిపల్ రాఘవేంద్ర, స్కూల్ కౌన్సెలర్ ఉన్ని కృష్ణన్, వాచ్‌మన్ ప్యాట్రిక్లను అరెస్టు చేశారు. కాగా, సంప్‌లో పడి రెండున్నరేళ్ల శివ చనిపోయాడు, అతను నర్సరీ చదువుతున్నాడు. బాలల దినోత్సవం రోజున స్కూల్లోని నీటి సంపు తెరిచి ఉంది. దాని పైన మూత లేకపోవడంతో బాలుడు అందులో పడిపోయాడు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష