బిగ్ బీ కి తప్పిన ఘోర కారు ప్రమాదం
- November 16, 2017
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కోల్‌కతాలో ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు హైస్పీడులో ఉండగా వెనుక చక్రం ఊడిపోయింది. దీంతో కారు ప్రమాదానికి గురైంది. 23వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బచ్చన్, తిరిగి ఎయిర్‌పోర్టుకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అందించిన ట్రావెల్ ఏజెన్సీకి ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేసింది. కారు ప్రయాణిస్తున్న సమయంలో వెనుక చక్రం ఊడిపోవడం, చాలా అరుదుగా జరిగే సంఘటన అని, అది సర్వీసు స్టేషన్ పొరపాటై ఉంటుందని తెలిసింది. అయితే ఈ కారు మోడల్ ఏమిటో ఇంకా తెలియరాలేదు.
శనివారం ఉదయం ముంబై విమానాన్ని అందుకోవడం కోసం ఎయిర్‌పోర్టుకి వెళ్తున్నప్పుడు, డఫెరిన్ రోడ్‌లో బచ్చన్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు వెనుక చక్రం ఊడిపోయిందని సెక్రటేరియట్ సీనియర్ అధికారి నేడు ధృవీకరించారు. ఆ కారును ట్రావెల్ ఏజెన్సీ అందించారని, ప్రస్తుతం ఆ ఏజెన్సీకి షోకాజు నోటీసు జారీచేసినట్టు పేర్కొన్నారు. సూపర్‌స్టార్ ప్రయాణించడం కోసం అద్దెకు తీసుకున్న ఈ కారు కోసం ఏజెన్సీకి పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లించినట్టు తెలిసింది. ఈ కారు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ గడువు చాలా రోజుల క్రితమే ముగిసిందని, అయినప్పటికీ దీన్ని వాడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఒకవేళ ఆ ఏజెన్సీ ఏదైనా తప్పు చేసిందని తేలితే తగిన చర్యలు తీసుకుంటాని సెక్రటేరియట్ వర్గాలు చెప్పాయి. ఈ ప్రమాదం అనంతరం బచ్చన్‌ను ఓ మంత్రి వాహనంలో ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లామని కోల్‌కత్తా ట్రాఫిక్ పోలీసు సీనియర్ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







