'2 కంట్రీస్' ఫస్ట్‌లుక్ విడుదల
- November 16, 2017
ఎన్.శంకర్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై సునీల్, మనీషారాజ్ జంటగా రూపొందించిన చిత్రం '2 కంట్రీస్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ- మలయాళంలో ఇదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం వినోదాత్మకంగా రూపొందించామని తెలిపారు. అమెరికా, ఇండియాలోని అద్భుతమైన లొకేషన్‌లలో చిత్రీకరించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈనెల 24న టీజర్ విడుదల చేస్తామని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని, భారీ బడ్జెట్‌తో ఉత్తమ సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ చిత్రం సునీల్‌కు ఓ మైలురాయి మూవీగా నిలుస్తుందని ఆయన అన్నారు. నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ, షాయాజీ షిండే, దేవ్ గిల్, కృష్ణ్భగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సితార, రాజా రవీంద్ర, షిజు, సంజన, శివారెడ్డి, ప్రవీణ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, కెమెరా:సి.రాంప్రసాద్, మాటలు:శ్రీ్ధర్ శీపాన, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.శంకర్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష