గోంగూర సహజ ఔషధం
- November 11, 2015
వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటే.. ఆహా ఏమి రుచిలే. గోంగూర పచ్చడి అంటే.. తెలుగువాళ్లకు ఏంతో ప్రీతికరం. పుల్లపుల్లగా.. నోరూరించే రుచి గోంగూర సొంతం. పచ్చడి చేసినా, ఊరగాయపట్టినా, పప్పు చేసినా, కూరల్లో జోడించినా, మటన్ లో గోంగూర తగిలించినా.. ఆ రుచి అమోఘంగా ఉంటుంది. గోంగూర ఇష్టపడని వాళ్లు బహుషా ఉండరేమో. ఏ కూరగాయల్లో వేసిన మంచి రుచినిచ్చే గోంగూరలో ఎన్నో పోషక విలువలున్నాయి. పొట్ట ఉదర భాగంలో మసాజ్ చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు చీప్ దొరికే.. అందరికీ అందుబాటులో ఉండే గోంగూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా గోంగూరలో దాగుంది. ఇందులో విటమిన్ సి, ఎ, బి6 తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. రకరకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే శక్తి పుల్లపుల్లని గోంగూరలో ఉన్నాయి. గోంగూరలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న గోంగూర చాలా పవర్ ఫుల్. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో జీర్ణశక్తి పెరిగి, డైజెస్టివ్ సమస్యలు దూరమవుతాయి. గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజు వారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే.. ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది. గోంగూరను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు కూడా గోంగూర అలవాటు చేయాలి. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది. గోంగూరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోంగూరను తరచుగా తీసుకోవడం వల్ల కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రక్తహీనతను దూరం చేసుకోవాలంటే.. శరీరానికి విటమిన్ కె చాలా అవసరం. విటమిన్ కె గోంగూరలో పుష్కలంగా లభిస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే.. సహజ ఔషధంలా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







