ఎన్నారైలూ.. భారత్‌కు బంగారం తీసుకురావాలనుకుంటున్నారా?
- November 11, 2015
సాధారణంగా విదేశాల్లో ఉండే భారతీయులు స్వదేశానికి బంగారంతో వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. గోల్డ్‌బార్స్, బంగారు ఆభరణాల విషయంలో ఎంత సుంకం చెల్లించాలనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. భారత్‌కు ఎన్ని కేజీల బంగారం తీసుకురావచ్చు, ఆభరణాలకు లభించే డ్యూటీ ఫ్రీ అలోయెన్స్ వంటి విషయాల గురించి సమగ్ర కథనం.
1)విదేశాల నుంచి భారత్‌కు తీసుకువచ్చే గోల్డ్బార్స్కు ఎటువంటి జీరో డ్యూటీ ఉండదు. పాసింజర్లు భారత్‌కు తీసుకు వచ్చే గోల్డ్బార్స్పై నాలుగు శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. అలాగే టోలా బార్స్‌కు పది శాతం కట్టాలి.
2)ఇక బంగారు ఆభరణాలకు మాత్రం కొంతవరకు డ్యూటీ ఫ్రీ అలోయెన్స్ ఉంటుంది. మగవారి రూ.50,000, ఆడవారికి రూ.లక్ష వరకు డ్యూటీ ఫ్రీ అలోయెన్స్ లభిస్తుంది. అయితే అనుమతించిన దాని కంటే ఎక్కువ విలువ గల బంగారాన్ని తీసుకువస్తే.. ఆ బంగారం విలువలో పది శాతం టాక్స్ కట్టాలి.
3)అలాగే గతంలో విదేశాల నుంచి భారత్‌కు పది కేజీల వరకు బంగారాన్ని తీసుకొచ్చే వీలుండేది. అయితే ఇటీవల మారిన నిబంధనల ప్రకారం భారత్‌కు తీసుకొచ్చే బంగారం కేజీకి మించకూడదు. అంతకుమించి ఎక్కువ ఉంటే ఆ బంగారాన్ని సీజ్ చేసి, ఆ ప్రయాణీకుడిని అరెస్టు చేస్తారు.
4)ఇక విదేశాల్లో జరిగే ఫంక్షన్లకు భారత్ నుంచి బంగారు ఆభరణాలు ధరించి వెళ్లేవారు కస్టమ్స్ అధికారుల నుంచి ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే తిరిగి భారత్‌కు వచ్చేటప్పుడు ఇబ్బందులు తప్పవు.
5)అనుమతించిన డ్యూటీ ఫ్రీ లిమిట్ కంటే ఎక్కువ బంగారంతో వచ్చేవారు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ చానెల్‌ను ఉపయోగించకూడదు. ఒకవేళ చెకింగ్ జరిగి పట్టుబడితే జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







