సౌదీ యువరాజు త్వరలో రాజుగా పట్టాభిషిక్తుడు కానున్నాడు
- November 17, 2017
రియద్ : వచ్చేవారంలో సౌదీ రాజుగా మహమ్మద్ బిన్ సల్మాన్‌ను పట్టాభిషేకం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌదీ రాజుగా వ్యవహరిస్తున్న కింగ్ సల్మాన్ పదవి నుంచి దిగిపోయి కుమారుడు, ప్రస్తుత యువరాజుగా వ్యవహరిస్తున్న మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పట్టంకడుతున్నట్లు బ్రిటన్ న్యూస్ ఏజెన్సీలు ప్రకటించాయి.
బ్రిటన్ న్యూస్ ఏజెన్సీల ప్రకారం.. వచ్చేవారంలో 81 ఏళ్ల కింగ్ సల్మాన్.. పదవి నుంచి దిగిపోయి కుమారుడికి సింహాసనాన్ని అప్పగించనున్నారు. అయితే సింహాసనాన్ని కుమారుడికి వదులుకున్నా.. ‘మసీదుల సంరక్షకుడు’ అనే హోదాతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టం కట్టే సంప్రదాయాన్ని కింగ్ సల్మాన్ పక్కనపెట్టారు.
సౌదీ అరేబియాలో అధికారమార్పు గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీలో సుమారు 40 మంది రాజకుటుంబ సభ్యుల మూకుమ్మడి అరెస్ట్‌లు జరిగాయనే వాదన వినిపిస్తోంది. మమమ్మద్ బిన్ సల్మాన్ అధికారంలోకి వస్తే మధ్యప్రాచ్యంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశముందని నిపుణుల అంచనా వేస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కలిసి పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. కాబోయో సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలపడం విశేషం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష