మెగాస్టార్ కి ఘోర అవమానం

- November 17, 2017 , by Maagulf
మెగాస్టార్ కి ఘోర అవమానం

మొత్తానికి నంది అవార్డులు 'నందిమూరి' అవార్డులుగా మారాయని సోషల్‌ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. 'లెజెండ్' కు ఉత్తమ చిత్ర అవార్డు రావడం 'జోక్ ఆప్ ది డికేడ్‌' అయి కూర్చుంది. అసలు ఆ సంగతి ప్రక్కనపెట్టేస్తే, 'లెజెండ్' గోలలో పడి తెలుగు దేశం ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని వ్యూహాత్మకంగా ఎలా అవమానించిందన్న విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. తనదైన ఛరిష్మాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన మెగాస్టార్ చిరంజీవికి.. అనేక ఏళ్ల వెండితెర వేల్పుగా తెలుగు తెరను శాసించిన చిరంజీవికి.. రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చిన ఘనంగా సత్కరించామని 2014 జ్యూరీ కమిటీ మెంబర్ అయిన ప్రసన్నకుమార్ నొక్కి వక్కాణించి ఘంటాపథంగా చెబుతున్నారు.
2014, 2015, 2016 సంవత్సరాలకు గాను రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ నేషనల్‌ అవార్డులకు కమిటీకి బాలకృష్ణ చైర్మన్ గా వ్యవహరించారు. మరీ బాలకృష్ణకు చిరంజీవిని తక్కువ చూడాలని అనిపించిందో లేక 80వ దశకంలో తన దైన డ్యాన్సులు, ఫైట్లతో తెలుగు సినిమా దశ-దిశను మార్చిన మెగాస్టార్ గొప్పతనం ఆయన కు అర్థం కాలేదో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కానీ అంశం!
వాస్తవంగా చూస్తే, రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వడం ద్వారా చిరంజీవిని అత్యంత ఘోరంగా అవమానించేందుకు ప్రయత్నించారు బాలకృష్ణ అధ్యక్షతన ఉన్న జ్యూరీ సభ్యులు! ఇది ఓ రకంగా కావాలని చేసిందేనని మనం అర్థం చేసుకోవచ్చు.అదేంటి.. రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తే చిరంజీవిని అవమానించినట్లు ఎలా అవుతుంది అనే సందేహం మీకీపాటికి వచ్చే ఉంటుంది. అవే మరీ కమ్మటి తెలివితేటలు.. అవార్డులు ఇస్తున్నట్లు ఇస్తూ..చిరంజీవి లాంటి లెజెండ్‌లను అవమానించడం కమ్మటి తెలివితేటల క్రిందకే వస్తాయి. కమ్మటి తెలివితేటలు ఎంత దారుణంగా ఉంటాయో మీకు సోదాహరంగా వివరిస్తాను. 2014 లో చిరంజీవి రఘుపతి వెంకయ్య పురస్కారం ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. అదే ప్రభుత్వం, 2014 లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును కమల్‌హాసన్‌కు.. 2015లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. 2016లో ఆ పురస్కారాన్ని రజనీకాంత్‌కు ఇచ్చారు. రఘుపతి వెంకయ్య అవార్డు అనేది కేవలం ఓ ప్రాంతీయ అవార్డు మాత్రమే. సింపుల్‌గా చెప్పాలంటే, కేవలం తెలుగు సినీ రంగానికే పరిమితమైన అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు(ఇది అర్థం చేసుకోవడానికి, ఆర్టికల్‌ క్రింద ఉన్న రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతల వివరాలు చూడండి)! దీనికి విరుద్ధంగా పేరులోనే ఉన్నట్టు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఓ జాతీయ అవార్డు అన్నమాట! అలాంటి జాతీయ అవార్డును కమల్‌హాసన్, రజనీకాంత్‌లకు ఇచ్చి చిరంజీవికి ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
అసలు ఏ రకంగా చిరంజీవి.. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ల కంటే తక్కువో చెప్పమనండి చూద్దాం. కమల్‌హాసన్‌ల కంటే అనేక రెట్లు ఎక్కువ మాస్ ఫాలోయింగ్ చిరంజీవి సొంతం. రజనీకాంత్ సూపర్ స్టార్ అవడంతో ప్రధాన పాత్ర పోషించింది అతడి స్టైల్‌.. స్టైల్ ప్రక్కనపెడితే క్రేజ్‌లో కానీ.. డ్యాన్స్ ,ఫైట్ల విషయంలో కానీ.. నటనలో కానీ, గ్లామర్ విషయం లో కానీ రజనీకాంత్ కంటే ఏ విధంగాను చిరంజీవి తక్కువ కాదు. ఆ మాటకొస్తే గ్లామర్‌, డ్యాన్స్‌.. పైట్ల విషయంలో చిరంజీవి ముందు రజనీకాంత్‌ దిగదుడుపే అని చెప్పవచ్చు. అలాగని ఇక్కడ రజనీకాంత్‌ను తక్కువ చేయడం లేదు.. వాస్తవికంగా ఆలోచిస్తే, ఎవరి ప్లస్‌లు వారికి ఉన్నాయి. ఇక, 90 వ దశకంలో ఓ సమయంలో రజనీకాంత్‌, అమితాబ్ బచ్చన్‌లు మించిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. రెమ్యూనరేషన్ విషయంలో, మార్కెట్ విషయంలో చిరంజీవికి మిగతా సూపర్ స్టార్లు అందుకోలేనంత స్థాయిని అందుకున్నాడు. ఆ సమయంలో మిగతా హీరోల హిట్ సినిమాల కలెక్షన్లు చిరంజీవి ఫ్లాప్ సినిమాలకు వచ్చేవంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారిగా ఓ సినిమాకు కోటి రూపాయలకు పైగా పారితోషకాన్ని అందుకున్న హీరో చిరంజీవే! అందుకే, అప్పట్లోనే ప్రతిష్టాత్మక 'వీక్‌ మ్యాగజైన్' 'బెటర్ దెన్ బచ్చన్' అంటూ చిరంజీవి మీద కవర్ స్టోరీ ని ప్రచురించింది. ఇక్కడ పాఠకుడు అర్థం చేసుకోవాల్సింది.. కమల్ హాసన్‌, రజనీకాంత్ లకు ఎన్టీఆర్ లకు నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు చిరంజీవికి ఎందుకు ఇవ్వలేదనేదే ప్రశ్న.. వాళ్ల కన్నా చిరంజీవి ఏ రకంగా తక్కువ అనే ప్రశ్నకు జ్యూరీ సభ్యులు ఏం సమాధానం చెబుతారు? ఒక్కసారి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు ఎవరెవరకి వచ్చాయో ఇక్కడ చూద్దాం..
చూశారా.. ఇళయరాజాకు వచ్చింది.. సూపర్ స్టార్ కృష్ణకు వచ్చిందీ.. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు వచ్చింది.. దాసరి నారాయణరావుకు ఇచ్చింది.. జమునకు వచ్చిందీ.. నూతన్ ప్రసాద్ కు వచ్చిందీ.. శారదకు వచ్చిందీ.. తాజాగా కమల్ హాసన్‌..రజనీకాంత్‌లకు..రాఘవేంద్రరావులకు వచ్చింది.. కానీ చిరంజీవికి మాత్రం ఈ అవార్డు కనీసం ఈసారి కూడా రాలేదు.. కమల్ హాసన్‌, రజనీకాంత్ లాంటి పొరుగింటి సూపర్ స్టార్లకు ఇస్తున్నప్పుడు వాళ్ల సమకాలీనుడు.. వాళ్లతో సమానంగా సినీ రంగానికి సేవలందించిన చిరంజీవికి నేషనల్ అవార్డు ఇవ్వాలన్న కనీస జ్జానం కమ్మటి ప్రభుత్వానికి.. ఆ కమ్మటి ప్రభుత్వం వేసిన కమ్మటి జ్యూరీకి ఏమాత్రం లేదు.. అంటే తమిళనాడుకుచెందిన కమల్‌, రజనీలకు ఓ జాతీయ అవార్డును ప్రకటించి అదే సమయంలో చిరంజీవికి రఘుపతి అవార్డు ను ప్రకటించడం ఆయన స్థాయిని తగ్గించడం కాదా! ఓ రకంగా ఆయన ను వ్యూహాత్మకంగా కావాలనే అవమానించడం కాదా!
విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, వాస్తవంగా జరిగింది ఇదీ.. 2014, 2015, 2016 లకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డును రజనీకాంత్‌, కమల్ హాసన్, రాఘవేంద్రరావులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అయితే, చిరంజీవి కి ఇవ్వకుండా రజనీకాంత్‌, కమల్‌లకు ఇస్తే వివాదాస్పదం అయ్యే అవకాశముందన్న ఓ పాడు ఆలోచనతో కంటితడుపు చర్యగా చిరంజీవికి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుగా రఘుపతి వెంకయ్య అవార్డును తూతూ మంత్రంగా ఇచ్చారని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల సూపర్ స్టార్లను గౌరవించడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు కానీ అదే స్థాయిలో ఉన్న మనవాడిని.. మనల్ని ఎన్నో ఏళ్ల పాటు తనదైన డ్యాన్సులు,ఫైట్లతో, నటనతో అలరించిన మెగాస్టార్ ను తక్కువుగా చూడటం ఎంత వరకు సమంజసం! పైగా, చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించాం కదండీ అంటూ జ్యూరీ సభ్యులు ఆయనను ఏదో ఉద్దరించేసినట్లు మాట్లాడుతున్నారు. ఒకసారి ఊహించుకోండి, రేపు నంది అవార్డుల ఫంక్షన్‌లో కమల్‌హాసన్‌, రజనీకాంత్‌లు జాతీయ అవార్డును అందుకుంటూ.. చిరంజీవి ఓ స్టేట్ అవార్డు అందుకోవడం ఎంద దరిద్రంగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి!
ఏదైనా కుల అహంకారంతో చిరంజీవిని తక్కువ చేయాలని చూస్తున్నవాళ్లు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే. ఇప్పటికీ బాక్సాఫీస్ కింగ్‌ చిరంజీవే.. దానికి ఉదాహరణ గత సంక్రాంతి విడుదలైన 'ఖైదీ నెం.150' యే తార్కాణం. గత సంక్రాంతికి విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి కంటే అనేక రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధించింది ఖైదీ నెం.150. గత సంక్రాంతికి విడుదలైన 'ఖైదీ నెం.150' 104 కోట్లకు పైగా షేర్ ను సాధించగా, అదే సమయంలో విడుదలైన బాలయ్య
గౌతమీపుత్ర శాతకర్ణి కేవలం అందులో సగం అంటే 52 కోట్ల షేర్ ను మాత్రమే సాధించింది. జాత్యహంకారంతో ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా బంగారం.. బంగారమే! నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా దాని వన్నె ఏ మాత్రం తగ్గదు. అసలు పక్షపాత ధోరణితో నువ్విచ్చే బోడి గుర్తింపులు చిరంజీవి అనే బంగారానికి ఏ మాత్రం అవసరం లేదు. తెలుగు సినిమా ఉన్నంత కాలం.. తెలుగు తెరకు ఓ ఎన్టీఆర్‌.. ఓ చిరంజీవి.. ఆ తర్వాతే ఎవరైనా!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com