'రక్షణమంత్రి ' అని పిలవండి చాలు
- November 17, 2017
న్యూఢిల్లీ: భారత్కు తొలిసారిగా పూర్తికాల మహిళా రక్షణశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నియమితులైన విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా సీతారామన్ దేశ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లును కలుసుకొని వారితో మాట్లాడి భద్రతను సమీక్షించారు. అయితే.. ఆమె పర్యటిస్తున్న సమయంలో జవాన్లకు ఓ చిక్కు వచ్చి పడింది. ఆమెను 'మేడమ్' అనాలా.. లేక 'సర్' అనాలా.. అనేది అర్థం కాక జవాన్లు గందరగోళానికి గురయ్యారట. వివిధ సందర్భాల్లో 'జైహింద్ మేమ్సాబ్' అంటే మరోసారి 'జైహింద్ సర్' అంటున్నారు. అసలు ఆమెను ఎలా సంబోధించాలో అర్థం కాక జవాన్లు ఒక్కోరకంగా పిలుస్తున్నారు.
దీనిపై రక్షణశాఖమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. తనను సర్.. మేడమ్.. అని అనొద్దని కేవలం 'రక్షణ మంత్రి' అంటే చాలని క్లారిటీ ఇచ్చేశారు. ఎలా పిలవాలా అని గందరగోళానికి గురవుతున్న సైన్యానికి రక్షణ మంత్రి అని పిలవమని చెప్పడం బాగుందని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 58ఏళ్ల సీతారామన్ రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1975, 1980-82 కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తాత్కాలికంగా రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష