కంఫర్మ్ అయిన భాగమతి రిలీజ్ డేట్.!
- November 17, 2017
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది నటి అనుష్క. లేడీ ఓరియెంట్ మూవీస్ అయినా అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి సైజ్ జీరో చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో మరో మూవీ చేసింది అనుష్క. అదే భాగమతి. ఈ సినిమాలో అనుష్క తన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఇటీవలే రిలీజైన భాగమతి ఫస్ట్‌లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించింది. అందులో అనుష్క గెటప్ డిఫారెంట్గా ఉండడంతో ఆశ్చర్యపరిచింది. అసలు ఈ సినిమా ఏంటీ...కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అనే క్యురయాసిటీ పెరిగింది. ఒక పోస్టర్ తోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వెండితెర పై చూద్దామా అనే అసక్తిని అభిమానుల్లో పెంచింది. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. 2018లో వచ్చే గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న భాగమతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. బంపర్ హిట్ చిత్రాల్ని నిర్మించి....రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాలుగు భాషల్లో సాహో వంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష