గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్న పవన్ కళ్యాణ్
- November 17, 2017
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం లండన్ లో గ్లోబల్ ఎక్స్ లెన్సీ అవార్డును అందుకున్నారు. ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఆయనకు ఈ అవార్డు అందజేసింది. గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్న తర్వాత పవన్ పలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ మీట్ న్యూ ఇండియా సదస్సులో భాగంగా 'భారత్‌లో పెట్టుబడులకు అవకాశాలు' అనే అంశంపై ప్రసంగిస్తారు.
యూరప్ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతోనూ సమావేశం అవుతారు. పవన్ పర్యటన ఏర్పాట్లను ఐఈబీఎఫ్ నిర్వాహకులు, యూరప్‌లోని జనసేన కార్యకర్తలు, అభిమానులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ను ఆయన అభిమానులు కలిశారు. కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాణం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి పవన్ బాగా కృషి చేశారు. పవన్ కారణంగానే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు గాను పవన్ కి ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్.. ఈ అవార్డును అందజేసింది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







