ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌: మెట్రో రైలునే లాగేశారు

- November 18, 2017 , by Maagulf
ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌: మెట్రో రైలునే లాగేశారు

దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లో భాగంగా 25 మంది ఆర్‌టిఎ (రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ) ఉద్యోగులు, 168 టన్నులు గల దుబాయ్‌ మెట్రో ట్రైన్‌ని 25 మీటర్ల మేర లాగేశారు. గతంలో దుబాయ్‌ పోలీసులు, ఇలాంటి ఫీట్‌నే చేశారు. 302 టన్నుల బరువు గల ఎ380 విమానాన్ని 100 మీటర్ల వరకు లాగి రికార్డు సృష్టించారు. ప్రతిరోజూ 30 నిమిషాల మేర, మొత్తంగా నెల రోజులపాటు.. అంటే 30 రోజులపాటు ఫిట్‌నెస్‌పై అవగాహనతో వ్యాయామం సహా పలు కసరత్తులు చేయాల్సిందిగా క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ 'ఛాలెంజ్‌'ని విసిరారు. ఈ ఛాలెంజ్‌తో దుబాయ్‌ మోస్ట్‌ యాక్టివ్‌ సిటీగా మారిపోయింది. నెల రోజులపాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫిట్‌నెస్‌లో భాగంగా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com