భారీగా పెరిగిన బంగారం ధరలు
- November 18, 2017
బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో, బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.325 మేర పెరిగి రూ.30,775గా నమోదైంది. అంతేకాక అంతర్జాతీయంగా కూడా బంగారానికి బలమైన సంకేతాలు వీస్తున్నాయి. సిల్వర్ కూడా రికవరీ అయింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరుగడంతో, వెండి ధరలు రూ.600 మేర పెరిగి రూ.41వేల మార్కును దాటాయి.
శనివారం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.41,150గా రికార్డైంది. ప్రస్తుతం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో, స్థానిక జువెల్లర్స్ నుంచి బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌తో దేశీయంగా బంగారం ధరలు పైకి ఎగిశాయి. అంతేకాక అంతర్జాతీయంగా డాలర్‌కు సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.325 చొప్పున పెరిగి రూ.30,775గా, రూ.30,625గా నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఈ మెటల్ రూ.175 నష్టపోయింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష