మల్టీ స్టారర్ మూవీలో నానీ.!
- November 18, 2017
'డీ ఫర్ దోపిడీ'తో నిర్మాతగా మారిన నానీ ఆ తరువాత ఏ సినిమాకీ నిర్మాణ సారథ్యం వహించలేదు. హీరోగానే తన హవాని కొనసాగిస్తున్నాడు.ఆల్రెడీ ఈ ఏడాది నిన్ను కోరి...నేను లోకల్ సినిమాతో హిట్ అందుకున్న నానీ...హ్యాట్రిక్ హిట్ కోసం పరుగులు తీస్తున్నాడు. ఎంసీఏ రిలీజ్ చేసి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నాడు. అయితే ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న నానీ మరోసారి నిర్మాత అవతారం ఎత్తనున్నాడట. ఈసారి నలుగురు పెద్ద హీరోల్ని ఒకే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. దీన్ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంతో నానీ ఓ కొత్త దర్శకుడికి అవకాశమిస్తున్నాడు. అయితే నానీ ఈ సినిమాలో కనిపించడు. నలుగురిలో ఒకడిగా ఉంటడట. మరి ఆ నలుగురు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అంటున్నాడు ఈ నేచురల్ నానీ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







