రాజమౌళి మరో మల్టీస్టారర్.!
- November 18, 2017
'బాహుబలి' దర్శకధీరుడు రాజమౌళి ఈసారి తీయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఆయన మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటించనున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. 2018 మే నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సందర్భంగా రాజమౌళి.. చరణ్, తారక్‌తో కలిసి ఆప్యాయంగా దిగిన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. మల్టీస్టారర్ రాబోతోందన్న వార్త సోషల్‌మీడియాలో రాగానే అభిమానులు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి నుంచే సినిమాకు టైటిళ్లు, బడ్జెట్, వసూళ్ల గురించి అంచనాలు వేసేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష