ఇవాంకా దయ - మన రోడ్లకు మహర్దశ

- November 19, 2017 , by Maagulf
ఇవాంకా దయ - మన రోడ్లకు మహర్దశ

హైదరాబాద్: నగరంలని రోడ్లకు మహర్దశ పట్టనుంది. మియాపూర్ నుంచి అసెంబ్లీ వరకు 12 లైన్ల రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు భాగాలుగా వంద కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోడ్ల నిర్మాణం అనుమతి కోసం ఫైల్ సీఎం వద్దకు చేరింది. వర్షాకాలం వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు రోడ్లు వేసినా పాడైపోతున్నాయి. దీంతో శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతీ ఏటా రోడ్లు వేయడం, వెంటనే ఏదో ఒక కారణంతో తవ్వడం ప్రధాన సమస్య.
ముఖ్యంగా డ్రైనేజీ, నీటిపైపు, విద్యుత్ లైన్లు, కేబుల్స్ వేసేందుకు పదే పదే తవ్వుతున్నారు. శాఖలమధ్య సమన్వయం లేకపోవడంతో పాటు రకరకాల కారణాలవల్ల రోడ్లు పాడౌతున్నాయి. అందుకే ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా రోడ్లు నిర్మించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా డ్రైనేజీ, నీటి పైపు లైన్లు వేయనున్నారు. రోడ్లకు ఇరువైపుల విద్యుత్ కేబుల్స్ కోసం గట్లు నిర్మించనున్నారు.

తర్వాత శాశ్వత ప్రాతిపదికన రోడ్లు వేయనున్నారు. మొదటి దశలో ఇలాంటి రోడ్లను వంద కి.మీ. నిర్మిస్తున్నారు. రూ 1950 కోట్లతో నిర్మించనున్న ఈ రోడ్లకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.

దీంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతకం చేయడంతో ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com