"ఛలో అసెంబ్లీ"కి తమ్మారెడ్డి భరద్వాజ సపోర్ట్

- November 19, 2017 , by Maagulf

ఆంధ్ర-తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం సహకరించకపోగా.. విభజించి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటివరాకీ ప్రత్యేక రాజధాని నిర్మించుకోడానికి కనీస స్థాయి వెసులుబాటు కలిగించలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం రేపు (నవంబర్ 20) ఆంధ్ర రాజకీయనాయకులు "ఛలో అసెంబ్లీ"కి పిలుపునిచ్చారు. ఈ "ఛలో అసెంబ్లీ"కి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన సపోర్ట్ ను అందించనున్నారు. 
చిత్రపరిశ్రమ నుంచి "ఛలో అసెంబ్లీ"కి మద్దతు పలకాల్సిన అవసరం చాలా ఉంది. నావంతుగా నేను ఈ బృహత్తర కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నాను అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com