మంచు రూపంలో ముంపు అంచున ముంబై, మంగళూరు..
- November 19, 2017
ముంపు అంచున ముంబై, మంగళూరు. ఈ రెండు నగరాలను నాసా తీవ్రంగా హెచ్చరిస్తోంది. రాబోయే వందేళ్లలో మంచు రూపంలో ముప్పు తప్పదంటోంది.. 2100 నాటికి.. తీర ప్రాంతాలకు ప్రమాదం తప్పదని తాజా పరిశోధనల్లో తేల్చింది. దేశంలో మిగిలిన తీర ప్రాంతాల కేంటే ముంబై, మంగళూరులకు మాత్రం మహా ప్రళయం తప్పదని ముందుగానే అలర్ట్ చేస్తోంది...
నాసా తాజా పరిశోధనలు భారత దేశాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్‌తో ముంబై.. మంగళూర్‌లకు పెను ప్రమాదం తప్పదని భయపెడుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యం కారణంగా... ధ్రువాల్లోని మంచు ఫలకాలు కరిగిపోయి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు.. అయితే తాజాగా నాసా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో.. భయంకర నిజాలు బయటపడ్డాయి.. తాజా పరిశోధనల్లో మహారాష్ట్రలోని మంగళూరు, ముంబై, ఆంధ్రలో కాకినాడతో సహా దాదాపు 293 ప్రధాన పోర్టు పట్టణాలను జీఎఫ్ఎం పరిశీలించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికా నుంచి అతిపెద్ద మంచు ఫలకం విడిపోయిందని గతంలో నాసా ప్రకటించింది. భవిష్యత్తులో ధృవప్రాంతాల్లో మంచు కరిగిపోవడం కారణంగా సముద్రజలాలు పొంగి వివిధ నగరాల ముంపుకు గురయ్యే అవకాశం వుందని నాసా తెలిపింది. భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో నాసా తాజాగా కనుగొన్న గ్రెడియంట్ ఫింగర్‌ప్రింట్ మ్యాపింగ్ అంచనా వేసింది. ఆ నివేదిక ఆధారంగా గ్రీన్ లాండ్ ఉత్తరాదితో పాటు తూర్పున ఉన్న మంచుపొరలు కరిగిపోవడం ద్వారా న్యూయార్క్ నగరానికి ఏర్పడే ప్రమాదం కంటే మంగళూరు, ముంబైలకు ఏర్పడే ముప్పు ఎక్కువగా వుందని తెలిపింది. ఊహించని రీతిలో సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉందని.. దీంతో తీర ప్రాంతంలో భవనాలకు భారీ ప్రమాదం తప్పదని తేల్చింది.
కర్నాటకలోని సముద్ర మట్టం ముంబై కంటే అధికంగా ఉందని.. ముంబైలో సముద్ర మట్టం 1.526 ఎంఎం మాత్రమే ఉండగా, మంగళూరులో నీటి మట్టం 1.598 ఎంఎం ఉందని పరిశోధకలు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏర్పడే భారీ వరదలు కారణంగా ఈ ఓడరేవు నగరాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచ్చింది..
సముద్ర తీర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది నాసా. ఈ హెచ్చరికలు తీరప్రాంత నగరల్లో ఉండే ప్రజలను భయపెడుతోంది. వందేళ్ల తరువాత ప్రమాదం పొంచివుందని నాసా చెబుతున్నా?.. రానురాను పెరుగుతున్న కాలుష్యం కారణంగా.. ప్రళయం ఎప్పుడైనా ముంచుకొచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు..
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష