80 శాతం వరకు పెరగనున్న పెట్రోల్ ధరలకు

- November 19, 2017 , by Maagulf
80 శాతం వరకు పెరగనున్న  పెట్రోల్ ధరలకు

రియాద్:  విలువ ఆధారిత పన్ను సౌదీఅరేబియాలో పెట్రోల్ ధరలను 80 శాతం వరకు పెంచనున్నాయి. . పెట్రోల్‌పై 5 శాతం వ్యాట్ విధించాలని అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ధరలు జనవరి 1, 2018 నుంచి అమల్లోకి రానున్నాయని సౌదీ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సౌదీకి చెందిన ఓ పౌరుడి ప్రశ్నకు స్పందించిన జనరల్ అథారిటీ ఆఫ్ జాకత్ అండ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ ట్విట్టర్ అకౌంట్‌ను రూపొందించింది. జనవరి 1, 2018 నుంచి ధరలు పెరుగుతాయని సూచించింది. సౌదీలో పెట్రోల్ తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ధరలు పెరగనున్నాయి. మరికొందరి వాదనలు వేరేలా ఉన్నాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయని, దాదాపు 80 శాతం పెరగనున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పలు వార్తా సంస్థలు కూడా ప్రకటించాయి.  దీంతో అక్కడి ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు వినిపిస్తున్నాయి. అత్యధికులు ఈ పెంపుదలను వ్యతిరేకిస్తున్నాయి. సామాన్యులపై భారం పడేఅవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com