బెంగుళూరులో ప్రణీత పబ్‌లు

- November 20, 2017 , by Maagulf
బెంగుళూరులో ప్రణీత పబ్‌లు

తారలందర్నీ రెస్టారెంట్ బిజినెస్ ఆకర్షిస్తున్నట్టుంది. అందరూ ఆవైపుగానే చూస్తున్నారు. ఫీల్డ్‌లో ఉన్నా లేకపోయినా ఓ రెస్టారెంట్ పెట్టుకుని అందరికీ ఇష్టమైన ఫుడ్ పెట్టేస్తే ఆహా.. లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకున్నట్లున్నారు  అందుకే రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంటరవుతున్నారు. టాలీవుడ్ హీరోలు ఆ దిశగా అడుగులు వేసి మంచి సక్సెస్ బాటలో ఉన్నారు. హీరోయిన్ ప్రణీత కూడా ఇప్పటికే బెంగుళూరులో ఓ పబ్ పెట్టి వ్యాపారం జోరుగా సాగుతుండడంతో మరో రెండు పబ్‌లు తెరవడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇప్పటికే ఈ బిజినెస్‌లో సూపర్ సక్సెస్ అయ్యావంటూ అవార్డులు, రివార్డులు కూడా అమ్మడిని వరిస్తున్నాయట. నమ్ముకున్న కెరీర్ నట్టేట ముంచినా రెస్టారెంట్ బిజినెస్ ప్రణితకు మంచి ఉత్సాహాన్ని, ఊపుని ఇస్తుంది. సో.. మనం కూడా ఈ బాపు బొమ్మ బిజెనెస్‌లో సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుందాం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com