పంజాబ్ లో వీసా మందిర్
- November 19, 2017
తెలుగు రాష్ట్రాల్లో చిల్కూరు బాలాజీ కి వీసా దేవుడు అనే పేరుంది. విదేశీ ప్రయాణం అనే కలను తీర్చుకొనేందుకు వీసా కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కాగా మన చిల్కూరు బాలాజీ లాగే మరో వీసా దేవుడు కూడా ఉన్నాడు. పంజాబ్ లో సిక్కులు ఏకంగా విమాన దేవాలయం నిర్మించారు. ఈ దేవుడుకి వీసా దేవుడనే పేరు కూడా పెట్టి.. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆ దేవుడికి బొమ్మ విమానాలను కానుకగా ఇస్తారు కూడా..!!
పంజాబ్ లోని జలంధర్ తల్ హాన్ లో హవాయూ జహాజ్ గురుద్వారా గా పిలిచే సిక్కుదేవాలయం ఉన్నది. కాగా ఒకప్పుడు ఈ గురుద్వారాని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాగా పిలిచేవారు.
ఈ గురుద్వారాను స్థానిక జాట్ కమ్యునిటీ, దళిత వర్గాల ప్రజలు వందేళ్ల క్రితం నిర్మించారు. ఈ గురుద్వారాలో ప్రార్ధన సమయంలో వీసా ఆమోదం పొందగలరు అనే విశ్వాసం ఉంది. ఇక్కడ భక్తులు విమానం బొమ్మనే ప్రసాదం గా ఇస్తారు. ఇలా చేస్తే.. త్వరగా వీసా లభిస్తుందని నమ్మకం. విమాన ప్రయాణం సమయంలో ఎటువంటి ఆపదలు కలగ కుండా రక్షణ కలుగుతుందని నమ్మకం. విదేశీ ప్రయాణం చేసే వారు ఈ గుడిలో విమానం బొమ్మను సమర్పిస్తారు. ఇక్కడ షాపుల్లో ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్ వేస్, లుఫ్తాన్సా లాంటి విమాన బొమ్మ నమూనాలు తయారు చేసి అమ్ముతారు. ఒక్కొక్కటి రూ.50 నుంచి 500 వరకూ ఉంటాయి. ఇక్కడ రోజూ కొన్ని వందల బొమ్మలు అమ్ముడవుతాయి.. ఈ గురుద్వారాకు వెళ్లాలంటే.. జలంధర్ నుంచి సుమారు.. 12 కి.మీ దూరంలో ఉన్న చిన్నన్ గ్రామం చేరుకోవాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







