శ్రీ రాఘవేంద్రస్వామి సేవలో సూపర్ స్టార్ రజని
- November 20, 2017
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీనటుడురజనీకాంత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన నటించిన 2.0 సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్వామిని దర్శించుకున్నట్లు సమాచారం. ముందుగా తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించిన ఆయన గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుదీంద్ర తీర్థులను కలిసి కొద్దిసేపు మాట్లాడి ఆశీర్వాదం పొందారు. ఆయన మంత్రాలయానికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా మఠానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు తుంగభద్రనదికి వెళ్తున్న సమయంలో కొందరు భక్తులు చూడగా తమిళనాడు మంత్రి అని చెప్పి అధికారులు వారిని పంపేశారు. అనంతరం మఠానికి చేరుకోగానే గుర్తించిన భక్తులు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు, కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. రజనీకాంత్ రాకతో మఠంలో సందడి నెలకొంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









