భారీ వర్షాలు: సౌదీలో స్కూల్స్, కాలేజీల మూసివేత
- November 21, 2017
సౌదీ కింగ్‌డమ్‌లోని పలు గవర్నరేట్స్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో స్కూళ్ళు, యూనివర్సిటీలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ రిపోర్ట్స్‌ని బట్టి చూస్తే, యాన్బు గవర్నరేట్ పరిధిలోని స్కూళ్ళను పూర్తిగా మూసివేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలియవస్తోంది. వాతావరణ పరిస్థితులు భీతావహంగా ఉండటంతో, విద్యార్థుల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. మక్కా, జెడ్డాలలోని తైఫ్, ఉమ్ అల్ కురా బ్రాంచ్‌లు మూసివేశారు. మక్కా, జెడ్డా, కులైస్, రబిగ్ గవర్నరేట్ పరిధిలోని స్కూళ్ళు కూడా మూసివేయడం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరింతగా భారీ వర్షాలు ఆయా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామనీ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







