అందరికంటే "రిచ్" హీరో ఎవరో తెలుసా.?

- November 21, 2017 , by Maagulf
అందరికంటే

టాలీవుడ్ లో అందరికంటే "రిచ్" హీరో ఎవరో తెలుసా.? అతను స్టార్ హీరో కాదు, రెమ్యూనరేషన్ ఎక్కువ కాదు!
సచిన్ జోషి హీరోల్లో అత్యంత ధనవంతుడు..తిప్పి కొడితే ఇతను చేసిన సినిమాలు ముచ్చటగా మూడు అప్పట్లో మౌనమేలనోయి,ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను. ,ఈ మధ్య ఒకటి నీ జతగా నేనుండాలి.మరో రెండు సినిమాలు చేసాడు అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయి వాటి పేర్లు కూడా ప్రేక్షకులకు తెలీదు..మరి లక్షలు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారికంటే ఇతను ఎలా ధనవంతుడు అనుకుంటున్నారా..సచిన్ హీరో అవ్వడానికన్నా ముందు పెద్ద బిజినెస్ మాన్..
ఎంత పెద్ద బిజినెస్ మాగ్నట్ అంటే మార్నింగ్ టిఫిన్ లండన్ లో చేసి, లంచ్ చేయడానికి ఫారిన్ వెళ్లి,ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఉంటాడో తనకే తెలియని పరిస్తితి..ఈ పాటికే మీకు సీన్ మొత్తం అర్దం అయిపోయుంటుంది కదా..ఈ మధ్య కింగ్ ఫిషర్ విల్లాను కొనుకున్నది కూడా ఈ సచిన్ జోషినే..ఇంతకూ కింగ్ ఫిషర్ విల్లా ఎంత పెట్టి కొనుక్కున్నాడో తెలుసా అక్షరాల 73 కోట్ల రూపాయలకు.. హాస్పిటాలిటీ నుండి హౌసింగ్ వరకు ఫిట్నెస్ సెంటర్స్ నుండి హెల్త్ స్పా ల వరకు సచిన్ జోషి బిజినెస్ విస్తరించి ఉంది..మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త కారు ఫస్ట్ సచిన్ ఇంట్లో ఉండాల్సిందే.కోట్ల రూపాయల విలువ చేసే కార్లు భవనాలు టాప్ బిలియనేర్ ల జాబితాలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు సచిన్ జోషి.
 
సినిమాలపై ఉన్న పాషన్ తో తనకు ఖాళీగా ఉన్న సమయాల్లోనే నటిస్తాడు..ఆ సినిమా హిట్టా ఫట్టా తనకు అనవసరం..ఇతని భార్య కూడా నటి..నటి మోడల్ ఊర్వశిశర్మ..మనకంటూ పుస్తకాలు చదవడం,సినిమాలు చూడడం లాంటి కొన్ని హాబీలుంటాయి చిన్న చిన్నవి..తనకు సినిమాల్లో నటించడం ఒక హాబీలాంటిది అన్నమాట.. ఇదన్నమాట మల్టీమిలియనీర్ అయిన నటుడి స్టోరీ..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com