విదేశీ వర్కర్లకు ఖతార్ గుడ్‌న్యూస్
- November 21, 2017
విదేశీ కార్మికులకు ఖతార్ గుడ్‌న్యూస్ చెప్పింది. విదేశీయులకు నివాస ప్రక్రియలను సులభతరం చేసేందుకు, వారు తమ స్వదేశంలోనే విధానాలన్నింటిన్నీ పూర్తి చేసుకునే వీలు కల్పించింది. ఈ కొత్త ఒప్పందంపై ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సింగపూర్‌కు చెందిన కంపెనీ సంతకాలు చేసుకున్నాయి. ఖతారీ నివాస ప్రక్రియలన్నింటిన్నీ విదేశీ వర్కర్లు తమ స్వదేశంలోనే పూర్తి చేసుకోవచ్చని ఖతార్ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో ఎనిమిది దేశాలకు వర్తిస్తుంది. భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ట్యునీషియాలు ఉన్నాయి. ఖతార్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఈ దేశాల వారు 80 శాతం ఉంటారు.
డీల్ ప్రకారం విదేశీయులు తమ మెడికల్ చెకప్, బయోమెట్రిక్ డేటా, ఫింగర్‌ప్రింట్, వర్క్ కాంట్రాక్టులపై సంతకం అన్ని కూడా ఖతార్‌కు రాకముందే తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే అనుమతి ఉంటుంది. ఈ డీల్‌తో మెడికల్ టెస్ట్‌లో విఫలమయ్యారని విదేశీ వర్కర్లను దేశంలోకి తిరస్కరించే కేసులు తగ్గుతాయని తెలిసింది. అక్టోబర్ మొదట్లోనే ఖతార్ ఈ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించింది. విదేశీ వర్కర్లు తమ ఉద్యోగులు మారడానికి వీలుగా గతేడాదే ఖతార్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







