వినూత్నంగా భార్యకై వెతుకుతున్న ఆర్య
- November 21, 2017
తమిళ్ యంగ్ హీరో ఆర్యకు భార్య కావాలట. ఇందుకోసం 'తనకు జీవిత భాగస్వామి కావాలని కోరుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భాగస్వామి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్లు, షరతులు లేవు. నేను మీకు నచ్చితే, మంచి భర్త అవుతాననే నమ్మకం ఉంటే 73301 73301 నెంబర్‌కి కాల్ చేయండి. ఇది జోక్ కాదు. జిమ్మిక్కు కాదు. నా జీవితానికి సంబంధించిన విషయం. దయచేసి కాల్ చేయండి. మీ కాల్ కోసం ఎదురుచూస్తున్నా!' అని ఆర్య వీడియోలో తెలిపాడు.
ఆర్య వీడియోలో చెప్పిన నెం. కు కాల్ చేస్తే మీకొక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో ఆర్య మాట్రిమోని వెబ్‌సైట్ www.mapillaiarya.com లింక్ ఉంటుంది. ఆ సైట్లో తనకు వివరాలు పంపాలని సూచించాడు. ఇప్పటికే ఆర్య కు భార్య అయ్యేందుకు వెబ్ సైట్ లో అమ్మాయిలు వివరాలు నమోదు చేస్తున్నారు. మరీ.. ఈ యంగ్ హీరోని పెళ్లాడే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







