చారిత్రాత్మక నగరం వారణాసి వేదికగా పవన్ 25 వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
- November 21, 2017
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ కాంబో గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి విధితమే.. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ డేట్ ను ప్రకటించుకొన్న ఈ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్నది. కాగా ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అభిమానులు.. పవన్, త్రివిక్రమ్ ల పుట్టిన రోజుకైనా రిలీజ్ చేస్తారు అని భావించారు.. కానీ పవన్ పుట్టిన రోజున చిన్న లిరిక్ వీడియో.. త్రివిక్రమ్ పుట్టిన రోజున ఫస్ట్ సాంగ్ లిరిక్ వీడియో ని రిలీజ్ చేశారు.. వీటికి మంచి స్పందన రావడంతో... ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్.. టైటిల్ పై మరింత ఆసక్తి నెలకొన్నది. అభిమానుల కోరిక తీరే సమయం రానే వచ్చింది.. పవన్ 25 వ సినిమా ఫస్ట్ లుక్.. ను చరిత్రాత్మక నగరం వారణాసి లో.. గంగా నది.. సమక్షంలో దీపాల వెలుగుల మధ్య.. కాశీ విశాలాక్షి.. ఆశీర్వాదంతో... నవంబర్ 24 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మానుల్ లు నటిస్తున్నారు. ఖుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నారు. కోలవెరీ ఢీ ఫేమ్ అనిరుధ్ సంగీతం అందిస్తూ.. తొలిసారిగా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







